కేరళ సీఎంతో సమావేశమైన క్రికెట్ దిగ్గజం..

SMTV Desk 2017-11-03 12:37:30  Sachin Tandulkar, Kerala Chief Minister Pinarayi Vijayan, meeting, Indian Super League Tournament, kerala

తిరువనంతపురం, నవంబర్ 03 : ఈ నెల 17న కొచ్చిలో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ సమావేశమై టోర్నీ ఆరంభ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. సీఎంతో భేటీ అనంతరం సచిన్‌ మాట్లాడుతూ... టోర్నీ ఆరంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించామని దానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. టోర్నీ నిర్వాహకులు, కేరళ బాస్టర్స్‌ సహ యజమానులు ఈ సందర్భంగా సీఎంను కలిసినట్లు సచిన్ తెలిపారు. కొచ్చిలోని జవహార్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో కేరళ-కోల్‌కతా మధ్య తొలి మ్యాచ్‌ జరగనుందన్నారు. కేరళ జట్టుకు సచిన్‌ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.