ఫోర్బ్స్‌ జాబితాలో భారత్ మహిళాలకు చోటు..

SMTV Desk 2017-11-03 11:10:03  forbes top 100 powerful momen list, indian icici bank ceo chanda kochhar, bolly wood actor priyanka chopra, roshni nadar

న్యూయార్క్, నవంబర్ 03 : ఫోర్బ్స్‌పత్రిక 2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ తరుపున ఐదుగురు మహిళలకు చోటు దక్కింది. అత్యంత శక్తివంతమైన మహిళల్లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ టాప్ స్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాలులో యూకే ప్రధాని థెరెసా మే, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్‌ నిలిచారు. మన దేశం నుండి ప్రముఖ కార్పొరేట్ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ చీఫ్‌ చందా కొచ్చర్‌ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే ఈమె 32 వ స్థానంలో నిలిచారు. ఈ మధ్య హాలీవుడ్ చిత్రాల్లో సందడి చేసిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 97వ స్థానంలో ఉన్నారు. *ఫోర్బ్స్‌ టాప్ 100లో ఇండియా మహిళల స్థానాలు 1. చందా కొచ్చర్‌( ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ) 32వ స్థానం 2. రోష్ని నాడార్‌ మల్హోత్రా (హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈఓ) 57 వ స్థానం 3. కిరణ్‌ మజుందార్‌ షా(బయోకాన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌) 71 వ స్థానం 4. శోభనా భర్తియా(హెచ్‌టీ మీడియా ఛైర్‌పర్సన్‌) 92 వ స్థానం 5. ప్రియాంక చోప్రా (ప్రముఖ బాలీవుడ్ నటి) 97 వ స్థానం