గంగా ఘాట్ లలోను మందులకు లొంగని బాక్టీరియా...!

SMTV Desk 2017-11-02 18:43:54  Anti Biotics, Newcomb University, Delhi IIT.

న్యూ ఢిల్లీ, నవంబర్ 2 : ఇటీవల వ్యాధి నిరోధకాలుగా పేరెన్నిక గన్న యాంటీ బయోటిక్స్ అధిక మోతాదు హానికరమని పరిశోధకుల హెచ్చరికలను మనం చూస్తున్నాం. కొద్ది సంవత్సరాల క్రిందట బ్రిటన్ కు చెందిన న్యూకొలజీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ ఐఐటీకి చెందిన పరిశోధకులు.. గంగా స్నానం కోసం ఎక్కువ మంది చేరే కొన్ని ప్రాంతాలలో వీటి పైన, అచ్చట వున్న మట్టి పైన, పరిశోధనలు చేపట్టారు. అక్కడ ఎక్కువ స్థాయిలో ‘ సూపర్ బగ్ ’ గా పేర్కొనే యాంటీ బయోటిక్స్ కు లొంగని జీన్స్ ఉన్నట్టు కనుగొన్నామని వీరు తమ నివేదికలో వివరించారు. చెత్త నిర్వహణ సరైన పంథాలో చేపట్టే ఇతర చర్యలు సక్రమంగా నిర్వహించగలిగితే ఈ సమస్యను తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు.