‘బాల కృష్ణుడు’ వచ్చేస్తున్నాడు

SMTV Desk 2017-11-02 17:28:06  nara rohith, balakrishnudu, pavan mallela,

హైదరాబాద్, నవంబర్ 2 : పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘బాల కృష్ణుడు’ చిత్రం విడుదల తేదిని ఖరారు చేశారు. ఈ నెల 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన రెజీనా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నారా రోహిత్ సరికొత్త లుక్ తో, ఫ్యాక్షన్ ప్రేమ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యాడు. కాగా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు.