బాలీవుడ్ బాద్ షా కు హ్యాపీ బర్త్ డే..

SMTV Desk 2017-11-02 16:23:38  shah rukh khan birth day, shah rukh khan, mumbai,

ముంబై, నవంబర్ 2 : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నేడు తన 52వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన ముంబైలోని అలీ బౌగ్ ప్రాంతంలో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో బాలీవుడ్ భామలు, ప్రముఖులు సందడి చేశారు. దీపిక పదుకొణె, ఆలియా భట్‌, కరణ్‌ జోహార్‌, ఫరా ఖాన్‌, ఫర్హాన్‌ అక్తర్‌, కత్రినా కైఫ్‌ తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కింగ్ ఖాన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ‘హ్యాపీ బర్త్‌డే ఎస్‌ఆర్కే’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. *పలువురు ప్రముఖులు ఎలా తెలిపారంటే.. అందరినీ మెప్పించే నటుడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. హ్యాపీ బర్త్‌డే షారుక్‌ : సచిన్‌ తెంద్కులర్ హ్యాపీ బర్త్‌డే షారుక్‌ ఖాన్‌. మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి : శ్రద్ధా కపూర్‌‌ హ్యాపీ బర్త్‌డే షారుక్‌ ఖాన్‌. అదృష్టం మీ వెన్నంటే ఉండాలని ఆశిస్తున్నాను : సానియా మీర్జా ఇలా పలువురు శుభాకాంక్షలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం షారుక్, ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.