పొరపాటుకు నలుగురు బలి..

SMTV Desk 2017-11-02 16:19:29  tea, sugar, Insecticide, 4 numbers death, Bahadurpur in the Darbar district of Bihar

దర్బాంగా, నవంబర్ 02 : పదేళ్ల బాలిక టీలో చక్కెరకు బదులు పురుగుల మందు కలపటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌ దర్బాంగా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా డిప్యూటీ ఎస్పీ దిల్నావాజ్‌ అహ్మద్‌ కథనం ప్రకారం.. కుటుంబసభ్యుల కోసం అర్చన అనే పదేళ్ల బాలిక టీ తయారుచేస్తూ పొరపాటున పురుగుల మందు కలిపేసింది. దీన్ని అందరూ కలిసి తాగడంతో దుఖాన్‌ మహ్తో(60), రామ్‌స్వరూప్‌ మహ్తో(65), అర్చన(10) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రకాశ్‌ మహ్తో, ప్రమీలా దేవిని చికిత్స నిమిత్తం దర్బాంగాలోని వైద్య కళాశాలకు తరలించారు. ప్రమీలా దేవి పరిస్థితి విషమంగా ఉండగా, చికిత్స పొందుతూ ప్రకాశ్‌ మహ్తో మృతి చెందారు.