జాతీయ వంటకంగా కిచిడీ.?

SMTV Desk 2017-11-02 11:42:21  food processing festival, 800 kgs kichidi, food prossesing minister Harsimrat Kaur Badal

న్యూఢిల్లీ, నవంబర్ 02 : ఈ నెల 3 వ తేదీ నుండి 5 వరకు ఫుడ్ ఫెస్టివల్ జరగనున్న తరుణంలో 800 కేజీల కిచిడీని త‌యారుచేయ‌నున్నారు. ఈ క్రమంలో ఇప్పడు కిచిడీ అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కిచిడీని జాతీయ వంటకంగా గుర్తి౦చనున్నార౦టూ విపరీతమైన పోస్టులు, ట్వీట్లు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఫుడ్ ప్రోసెసింగ్ మంత్రి హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ స్పందించారు. "కిచిడీని జాతీయ వంట‌కం అంటూ కిచిడీ చేసింది చాలు.. వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియాలో రికార్డు ఎంట్రీ కోస‌మే ప్ర‌య‌త్నం" అంటూ హ‌ర్‌సిమ్ర‌త్ ట్వీట్ చేశారు. కాగా ఈ 800 కేజీల కిచిడీని ప్ర‌ముఖ షెఫ్ సంజీవ్ క‌పూర్ త‌యారు చేయనున్నారు.