అర్ధం కానీ రివ్యూలు.. గందరగోళంలో ఆటగాళ్ళు...

SMTV Desk 2017-11-02 11:21:55  india- newzealand,first t-20, rohit sharma out issue, ultra edge technology, new delhi

న్యూఢిల్లీ, నవంబర్ 02 : నిన్న భారత్- కివీస్ ల మధ్య జరిగిన T-20 మ్యాచ్ లో ఒక వింత సన్నివేశం చోటు చేసుకుంది. సాదారణంగా ఆటలో నిర్ణయాలు తీసుకోవడంలో అంపైర్లు తడబడతారు. కానీ నిన్న మ్యాచ్ లో ఏకంగా థర్డ్‌ అంపైర్‌ అయోమయానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. కివీస్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ వేసిన 19 ఓవర్లో చివరి బంతిని అఫ్- సైడ్ దిశగా వేశాడు. క్రీజ్ లో ఉన్న రోహిత్ శర్మ షాట్ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్ కు తగిలి, తగలనట్లు వెళ్లి కీపర్ చేతిలో పడింది. కీపర్ లాథం అప్పీల్‌ చేయకపోగా, బోల్ట్, కెప్టెన్ విలియమ్సన్‌ అప్పీల్‌ చేయడంతో అంపైర్లు ధర్డ్‌ అంపైర్‌తో సమీక్షించుకున్నారు. అయితే రిప్లైలో నాట్ ఔట్ గా తేలింది. న్యూజిలాండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్ వైపు నుంచి కివీస్‌ ప్లేయర్లు అవుట్‌ అనే విషయాన్ని తెలియజేయడంతో విలియమ్సన్‌ మరోసారి రివ్యూ కోరాడు. మరోసారి పరిశీలించిన ధర్డ్‌ అంపైర్‌ బంతి అల్ట్రా ఎడ్జ్‌ టెక్నాలజీ ద్వారా ఔట్ గా ప్రకటించాడు. దీంతో రోహిత్ శర్మకి ఏమి అర్ధంకాక ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పెవిలియన్ కు చేరాడు.