అగ్రదేశ౦లో మరో కాల్పుల కలకలం..

SMTV Desk 2017-11-02 10:36:45  new york firing incident, value mart store, terrorist,

వాషింగ్టన్, నవంబర్ 02 : నిన్న న్యూయార్క్ లో జరిగిన ఉగ్రదాడి నుండి అగ్రదేశం తేరుకోకముందే అమెరికాలో మరో దాడి కలకలం రేపుతోంది. స్థానిక వాల్ మార్ట్ స్టోర్ లోకి చొరబడిన దుండగుడు ఉన్నట్టుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ దుండగుడు ఏకంగా 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా అమెరికాలో జరుగుతున్న ఈ వరుస దాడులకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.