దేశంలోని సులభ వాణిజ్యంలో తెలంగాణకు మొదటి స్థానం...

SMTV Desk 2017-11-01 19:08:07  ease of business country wide telangana 1st

హైదరాబాద్, నవంబర్ 01 : కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ విడుదల చేసిన తాజా ర్యాంకుల ప్రకారం సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) తెలంగాణ రాష్ట్రం దేశీయంగా ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 15వ స్థానం లభించింది. హర్యానకు 2వ స్థానం, పశ్చిమ బెంగాల్ కు 3వ స్థానం దక్కింది. ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం వ్యాపార సంస్కరణలో భాగంగా సులభతర వ్యాపార నిర్వహణ పై ర్యాంకుల పద్ధతి ప్రారంభించింది. పారిశ్రామిక, వాణిజ్య తదితర రంగాలలో సంస్కరణల పద్దతులలో రాష్ట్రాలకు ర్యాంకుల విధానం రూపొందించింది. అనుమతులు, లైసెన్సు పద్దతులు, ప్రభుత్వం నుంచి సహకారం, పలు అంశాలు ఇందులో పరిగణిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు 2016-17 లో పెద్దగా సంస్కరణలు చేపట్టాయి. ఈవోడీబీ ర్యాంకుల్లో ప్రధమ స్థానం పొందాయి. 2017-18 లో 376 అంశాల ఆధారంగా ర్యాంకుల విధానం రూపొందించారు. ఇప్పటికి అమలవుతున్న సంస్కరణల ఆధారంగా ప్రస్తుత ర్యాంకులను కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సామర్థ్యంతో, సాంకేతికతను జోడించి అనువైన పరిస్థితులు కల్పించటం ద్వారా ఈ ప్రధమ స్థానం దక్కింది. డిజిటల్ టెక్నాలజీ, మానవ సంబంధాలలో ప్రత్యేకత, సమస్యల నివారణలో తక్షణ ప్రయత్నాలు ఈ గుర్తింపునకు కారణం. పాఠకులకు గమనిక : (సమాచార సేకరణలో కొన్ని పొరపాట్లు జరిగినందు వలన ఈ వార్తను పరిగణలోకి తీసుకోనవలదని మనవి. అసౌకర్యానికి చింతిస్తున్నాము.)