అనార్థలకి దారి తీసిన అతివేగం

SMTV Desk 2017-06-09 11:59:21  bike, accident, boy

ఘాట్ కేసర్, జూన్ 08 : ఈ మధ్య కాలంలో అతి వేగం తో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో యువత (22-30) సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ గురి కావడం జరుగుతుంది. అదే తరహా మరో ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మోటార్ సైకిల్ అతి వేగంగా నడుపడమే ఈ ప్రమాదానికి కారణం. వివరాల్లోకి వెళ్ళితే యదాద్రి జిల్లాకు భువనగిరి మండలం తుక్కపురం గ్రామానికి చెందిన పిట్టల హరిచంద్రప్రసాద్ (22) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. అయితే ఇంటి నుంచి మూడురోజుల క్రితం బైక్ తీసుకోని బయటకు వెళ్ళాడు. తిరిగి మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన హరి ప్రసాద్ బుదవారం రోజున తెల్లవారు జమున 4 గంటల సమయంలో బైక్ తీసుకోని ఉప్పల్ కు వచ్చాడు. అక్కడ స్నేహితుడు హరి క్రిష్ణ తో కలిసి ఉదయం 7 గంటలకు భువనగిరి వెళ్తుండగా వరంగల్ జాతీయ రహదారి ఘట్ కేసర్ పోలీసుస్టేషన్ జోడిమెట్ల కూడలి సమీపంలో వేగంగా వెళ్తూ అదుపుతప్పి విద్యుత్ స్తంభంను ఢీకొట్టారు. కింద పడిన హరిచంద్రప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. హరిచంద్రప్రసాద్ ఫ్రెండ్ హరికృష్ణ కు తీవ్ర గాయాలు కావడంతో స్టానికులు ఉప్పల్ డిపో వద్ద ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి పిట్టల ఆనంద్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.