పన్ను మెరుగుదలలో సరళి తత్వం...

SMTV Desk 2017-11-01 18:27:47  GST, Goods and Services Tax, latest national news, latest news

న్యూఢిల్లీ, నవంబర్ 1 : కొన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో కలిసి ఏర్పాటు చేసిన జిఎస్టి మండలి, ప్రస్తుతం వ్యాపార వర్గాలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకోని పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ నెల ప్రారంభంలో జరగనున్న ఈ సమావేశంలో ఎగుమతి దారులకు, బడుగు వర్గాల వారికీ ప్రతికూలంగా వున్నా అంశాలపైన దృష్టి పెట్టాలి. మొదట్లో జిఎస్టి పట్ల అపోహలు, భయాలు, ఇందుకు కారణాలై ఉండొచ్చు. రెండవ త్రైమాసికంలో అనుమానాలు తగ్గటంతో పలువురు, ఎగుమతులు వృద్ధి అయ్యే చర్యలను కోరుతున్నారు. అందుకోసం పెట్టుబడులు అందుబాటులో వీలు కల్పించటం, క్రమబద్దీకరణను సులభతరం చేయటంపై దృష్టి పెట్టాలని ఆశిస్తున్నారు. అసలే అధికంగా పోటితత్వం ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాపార వర్గాలకు అండ దండలు కల్పించాలని పూర్తిగా ఆదాయ పెంపుదలపైన, కాకా క్రమంగా విస్తరణ పట్ల దృష్టి నిలిపితే బాగుంటుంది. ప్రభుత్వం వ్యాపార సరళీకరణ కోసం మొదటి నుంచి కృషీ చేస్తున్నందున ఆ విధాన౦ పన్ను నిర్మాణ౦లో కూడా కనిపించాలి. అధిక శాతం పన్ను చెల్లించే వర్గాల నుంచి జిఎస్టి వసూళ్లు, ఆదిలో నిరాశా జనకంగా స్వల్ప శాతంలో కనిపించాయి. అయితే పన్ను చెల్లించే వర్గాల విస్తరణ మూలంగా మున్ముందు అధికంగా వసూళ్లు రాబట్ట గల విధానంపైన, జిఎస్టి సరళీకరణ పైన భారం మోపి, ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు.