కేంద్రమంత్రి కాళ్ళు పట్టుకున్న గుజరాత్ డీజీపీ..!!

SMTV Desk 2017-11-01 17:06:28  Union Minister Rajnath Singh, Gujarat DGP, holding the legs,

న్యూఢిల్లీ, అక్టోబర్ 01 : గుజరాత్ డీజీపీ.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాళ్ళు పట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ "గుజరాత్ డీజీపీ రాజ్ నాథ్ కాళ్ళు పట్టుకున్నారు. ఇది చూసాక ఎన్నికలు సామరస్యంగా జరుగుతాయన్న నమ్మకం పోయింది" అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. చాలా మంది ఈ ఫోటోకి రీట్వీట్ చేస్తూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ఈ ఫోటో మాజీ ఐపీఎస్‌ అధికారి యోగేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించిన "క్యాయే సచ్‌ హై" అనే చిత్రంలోనిదని తెలిసింది. ఫొటోలో ఉన్న వ్యక్తి స్థానంలో రాజ్‌నాథ్‌ చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి పెట్టేశారు. అయితే ఈ విషయంపై రాజ్ నాథ్ స్పందిస్తూ.. “ఆ ఫోటోలో ఉన్నది నేను కానప్పుడు నా కాళ్ళను డీజీపీ ఎలా పట్టుకుంటారు”. అంటూ ఆగ్రహ౦ వ్యక్తం చేసారు.