వృద్ధాప్య నివారణ వీలు కాదంటున్న పరిశోధకులు

SMTV Desk 2017-11-01 16:29:37  American Scientist clarify Aging prevention, University of Arizona

న్యూఢిల్లీ, అక్టోబర్ 01 : ప్రపంచ వ్యాప్తంగా వృద్ధాప్య నివారణ కోసం శాస్త్రజ్ఞులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అలాంటి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు దాదాపు లేనట్లేనని అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జొన్నా మాసేల్ సెలవిస్తున్నారు. వృద్ధాప్య ఛాయలు బహుకణ జీవులైన మానవులలో కనిపించకుండా ఉండాలంటే వీలు కాని పని. బలహీనంగా వుండే కణాలకు పోటీతత్వం ద్వారా తొలగించి, బలంగా ఉండే వాటిని మాత్రమే నిలిచేలా చేయవలసి ఉంటుంది. బలహీన కణాలే వయస్సు పైబడడానికి కారణం. మన వెంట్రుకలలో కణాలు ఏ విధంగా పని చేయలేక రంగు మారుతాయో.. అలాగే ఈ కణాలు కూడా చిక్కుపడి, క్యాన్సర్ కణాలకు నాంది పలుకుతాయి. ఈ క్యాన్సర్ కణాలు గుర్తు పట్టరాని విధంగా ఉంటాయని ప్రొఫెసర్ నెల్సన్ వివరించారు. కణాల మధ్య పోటీ ఏర్పడినప్పుడు క్యాన్సర్ కణాలు మోసం చేస్తాయని అందువలన ఎంత ప్రయత్ని౦చినా సహజ ఎంపిక కణాల మధ్య వీలు కాదన్నారు. వయస్సుతో పాటు కణాలు చిక్కుపడి పెరుగుదల నిలిచిపోవడం ఫలితంగా సరిగా పని చేయకపోవడం జరుగుతుందని అమెరికా ప్రొఫెసర్ వివరణ ఇచ్చారు.