మీకు తెలుసా ఇతను ఎవరో?

SMTV Desk 2017-11-01 15:50:17  Halloween celebrations, Netijans, Christmas, upasana ramcharam wife

హైదరాబాద్, నవంబర్ 01 : ‘హాలోవీన్‌’ వేడుకను సెలబ్రిటీలు ఘనంగా నిర్వహించుకున్నారు... అసలు హాలోవీన్ వేడుక అంటే ఏంటో చాలా మందికి తెలియని విషయం... చెప్పాలంటే క్రిస్మస్ కు ముందు ఈ హాలోవీన్‌ వేడుకను జరుపుకుంటారు. వివిధ రకాల దుస్తులు, గెటప్‌లు వేసుకుని సందడి చేసే ఈ పండగను దాదాపు మూడు రోజులు జరుపుకుంటారు. సెలబ్రిటీలు కూడా ‘హాలోవీన్‌’ను వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ వ్యక్తి ఫొటోను రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అందరికీ హాలోవీన్‌ పండగ శుభాకాంక్షలు చెప్పుతూ..ఈ స్వీటెస్ట్‌ వ్యక్తిని గుర్తుపట్టండి? అని రాశారు. ఉపాసన ప్రశ్నకు నెటిజన్లు స్పందించి, అక్కడ ఉన్నది ఎవరో కాదు రామ్‌చరణ్‌కు ప్రియమైన సోదరుడు వరుణ్‌తేజ్‌ అని కామెంట్ల వర్షం కురిపించారు. ఈ పండగ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు వివిధ గెటప్‌లలో తయారై సందడి చేశారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్‌ కుమారుడు అల్లు అయాన్‌, మంచు విష్ణు కుమార్తెలు, తదితరులు ఈ వేడుక సందర్భంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మధ్యల్లో హాల్ చల్ చేస్తున్నాయి.