యూపీ సీఎంపై నెటిజన్ల కన్ను...

SMTV Desk 2017-11-01 15:01:24  UP CM Shivraj Singh Chouhan blows a kiss to some man yelling, Speceal media, amerika, Netijan

భోపాల్, నవంబర్ 01 ‌: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పై నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభకు హాజరైన సీఎం చౌహాన్‌ ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్ల‌యింగ్ కిస్‌ ఇచ్చారు. అది కాస్తా.. ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని నెటిజన్లు మామాజీ.. ఐ టూ లవ్యూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం చౌహాన్‌ అమెరికా రహదారుల కంటే మధ్యప్రదేశ్‌లోని రోడ్లు బాగున్నాయంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. గుంతలమయంగా ఉన్న రోడ్ల‌ను అమెరికావిగా.. చక్కగా ఉన్న రోడ్లను మధ్యప్రదేశ్‌ రహదారులుగా ఫొటోలు పెట్టి కామెంట్లు పెట్టారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.