ఆలంఖాన్‌ వారసులను పరామర్శించిన సీఎం కేసీఆర్...

SMTV Desk 2017-11-01 14:34:52  Nawar Uloom chairman Nawab Shah Alam Khan, death, kcr, hyderabad

హైదరాబాద్, నవంబర్ 01 : దక్కన్ సంస్కృతికి ప్రతీకగా నిలిచినా ప్రముఖులు అన్వార్ ఉలూం విద్యాసంస్థల చైర్మన్ నవాబ్‌ షా ఆలంఖాన్‌ ఇటీవలే కన్నుమూశారు. బర్కత్‌పురలోని ఆలంఖాన్‌ గృహానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆలం ఆరోగ్యం ఎలా క్షీనించిందో ఆయన అడిగి తెలుసుకున్నారు. వాబ్‌ షా కుమారులు మహబూబ్‌, ఖాదర్‌, జాహెద్‌, మహ్మద్‌, మహమూద్‌, అహ్మద్‌, ముస్తాఫాలను ఆయన పరామర్శించారు. నవాబ్‌ షాతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నవాబ్‌ షాను గతంలో ఒకసారి కలిశానని.. హైదరాబాద్‌లో మొదటి పారిశ్రామికవేత్త అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించే వ్యక్తి అంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి వెంట గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.