గిదా.. మన సచివాలయం...కేసీఆర్

SMTV Desk 2017-11-01 13:49:41  Hyderabad, assembly, sachivalayam, kcr comment,

హైదరాబాద్‌ : తెలంగాణ శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో బీజేపీ సభ్యులు కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో అడిగిన ప్రశ్నలు, చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. దేశంలోని 29 రాష్ట్రాలకు ఉన్న సచివాలయాలలో అడ్డదిడ్డమైన సచివాలయం తెలంగాణ రాష్ట్రానిదే అని అన్నారు. కనీసమైన నిబంధనల ప్రకారం కూడా ఇవి నిర్మాణం కాలేదని కేసీఆర్ బదులిచ్చారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ కూడా అధ్వానంగా ఉందన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రాలు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. నగరంలో క్రీడామైదానాలకు కొదవలేదని, 19 పెద్ద, ఇతర మైదానాలు ఉన్నాయని తెలిపారు. బైసన్‌పోల్‌ మైదానం క్రీడలకు ఉద్దేశించింది కాదని, మిలటరీ వాళ్లదని స్పష్టం చేశారు. ఇక మన శాసన సభలో పార్కింగ్‌ సౌకర్యాలే లేవని కేసీఆర్‌ అన్నారు. శాసన సభ నుంచి మండలికి వెళ్లాలంటే సరైన దారి లేదన్నారు. ఒక రాష్ట్ర సచివాలయం ఎంత బ్రహ్మాండంగా ఉండాలి అని ప్రశ్నించారు. దేశంలోనే అద్భుతమైన, చారిత్రకమైన సచివాలయం, శాసనసభ, మండలి, పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ భవనాలు మన తెలంగాణలో నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించారు.