భూటాన్ బుల్లి రాకుమారుడితో సుష్మాజీ

SMTV Desk 2017-11-01 13:36:37  Bhutan King, Jigme Kesar Namgyel Wangchuk, bharath tour, Sushma Swaraj

న్యూఢిల్లీ, అక్టోబర్ 01 : భారత పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీ చేరుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన వాంగ్ చుక్ దంపతులకు భారత్ విదేశంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుష్మా భూటాన్ రాజుతో భేటీ అయ్యారు. వాంగ్‌చుక్‌ వారసుడు, బుల్లి రాకుమారుడితో ఆమె కాసేపు ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. కాగా వాంగ్‌చుక్‌ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్యనున్న ద్వైపాక్షిక సంబంధాల గురించి ఆయన చర్చించనున్నారు.