ఇందిరా గాంధీకి నాయకుల నివాళ్ళు...

SMTV Desk 2017-11-01 12:39:17  Former Prime Minister Indira Gandhi is the 33rd death anniversary, delhi, modi, rahulgandi, manmohansing

న్యూఢిల్లీ, నవంబర్ 01 : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 33వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళ్ళు అర్పించారు. ఢిల్లీలో ఇందిర స్మారక ప్రాంతమైన శక్తిస్థల్‌ వద్ద మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు పూలతో ఆమెకు నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్‌, రాహుల్‌లు 1 అక్బర్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ మోమోరియల్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ తన చివరిశ్వాస దాకా దేశానికి సేవలందించిన సమర్ధులైన, దూరదృష్టి కలిగిన నేత అని ప్రణబ్‌ ట్విట్టర్‌లో కొనియాడారు. క్షమాగుణం ధైర్యవంతుల లక్షణం గలది ఇందిరా గాంధీ అని రాహుల్‌ తన నాయనమ్మ ఫొటోతో సహా ట్వీట్‌ చేశారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు ట్విట్టర్‌లో నివాళులు తెలిపారు.