రుణమాఫీ పూర్తయినట్లు పత్రాలు :కేసీఆర్

SMTV Desk 2017-11-01 10:29:54  CM KCR, Land papers, pragathi bhavan, farmers

హైదరాబాద్, నవంబర్ 01 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం వచ్చే డిసెంబరు 31కల్లా ముగుస్తుందని, జనవరి ఒకటి నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం ప్రతిభ భవన్ లో వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ పూర్తయినట్లు పత్రాలు ఇవ్వాలన్నారు. బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు, తిరిగి చెల్లించేటప్పుడు, పునరుద్ధరణ (రెన్యూవల్‌) చేసేటప్పుడు అన్ని వివరాలు చెప్పాలన్నారు. రైతులను సంఘటితం చేస్తున్నామని, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలకు కొత్త విధానం తెస్తున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.