కోడలి పై లైంగిక దాడి....అనుమానం తో వైద్య పరీక్షలు

SMTV Desk 2017-06-09 11:37:32  uncle, daughterilla

హైదరాబాద్, జూన్ 08 : రోజు రోజుకి ఆడపిల్లపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. సమాజంలో ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతుంది. కనీసం కుటుంబ సభ్యుల మధ్య కూడా రక్షణ లేదు. అలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగు లోకి ఒకటి జరిగింది. తల్లిదండ్రులు లేనప్పుడు తండ్రిలాగా చూసుకోవాల్సిన మేనమామ కోడలి పై అత్యాచారానికి ఒడిగట్టాడు. చాలా సార్లు ఆమె పై లైంగిక దాడి కూడా చేశాడు. చంపాపేట్ ప్రాంతానికి చెందిన దంపతుల మేన కోడలికి ఎనిమిది నెలల క్రితం పెళ్లి చేసి పంపించాడు. ఆమె భర్త తో రెండు నెలలు కాపురం చేసాక ఇద్దరు గొడవపడ్డారు. ఆమె మేన మామ ఇంటికి వచ్చింది. మేనకోడలి పై అత్యాచారం చేయడానికి మేనమామ లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేశాడు. తరువాత నెల రోజుల క్రితం భర్త దగ్గరికి వెళ్ళింది. భార్య పై అనుమానం వచ్చిన భర్త ఆమెకు వైద్య పరిక్షలు చేయించాడు. రిపోర్టులో ఆమె గర్భవతి అని తేలింది. వెంటనే ఆమెను మేనమామ ఇంటికి పంపించాడు. భాదితురాలు కంచన్ బాగ్ పోలీసులకు బుధవారం ఆమె పిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.