అదృశ్యమైన జయలలిత మేనకోడలు..

SMTV Desk 2017-10-31 15:15:45  Deepa Jayakumar missing case, Dinakaran, tamilnadu.

చెన్నై, అక్టోబర్ 31 : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అదృశ్యమైనట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమెకు తన భర్తతో విభేదాలు తలెత్తడంతో ఆమె ఇంటి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీప భర్త మాధవన్ తనను దీప డ్రైవర్ చంపుతానంటూ బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో దీప తన భర్త చెప్పిందంతా అబద్దం అంటూ పోలీసులకు తెలిపి ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. అయితే రానున్న ఉప ఎన్నికల్లో దీప ఆర్కేనగర్‌ నుంచి పోటీ చేస్తానని చెప్పడం మరోవైపు దినకరన్ కూడా అదే స్థానం నుండి పోటీ చేస్తాననడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.