రాజకీయ పార్టీ పెట్టిన హీరో ఉపేంద్రా..రా...

SMTV Desk 2017-10-31 13:35:38  Kannada actor Upendra, launch political party, Bengaluru.

బెంగుళూరు, అక్టోబర్ 31 : ప్రముఖ కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒక కొత్త పార్టీని నెలకొల్పాడు. కర్నాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీని ఉపేంద్ర ప్రకటించారు. బెంగుళూరులోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన వేదికలో ఆయన తన పార్టీ లోగోను ఆవిష్కరించి, సిద్దాంతాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీని నెలకొల్పినట్లు తెలిపారు. రైతుల గురించి మాట్లాడుతూ రైతులను ఆదుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానని, అంతేకాకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కేపీజేపీ పార్టీ పేదలకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా వచ్చే ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపేంద్ర ఈ పార్టీని నెలకొల్పడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే అభిమానుల కోరిక మేరకే ఈ పార్టీని నెలకొల్పినట్లు తెలిపారు.