మరో మారు విజయం దిశగా అడుగులు వేస్తున్న బ్రిటన్ ప్రధాని

SMTV Desk 2017-06-09 11:15:14  Britan PM, Therisa May,Elections,Concervation party,

లండన్, జూన్ 9 : ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా వ్యవహరిస్తున్న థెరిస్సా మే, మరో సారి బ్రిటన్ ఎన్నికలలో సత్తా చాటి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. ఆమె నేతృత్వం వహిస్తున్న కన్సర్వేషన్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలున్నాయని ఇటీవల చేపట్టిన ప్రజాభిప్రాయంలో వెల్లడైంది. కన్సర్వేషన్ పార్టీకి, ప్రతిపక్షపార్టీ అయిన లేబర్ పార్టీ గట్టి పోటీనీ ఇచ్చినప్పటికీ అధికారం మాత్రం కన్సర్వేషన్ పార్టీకే ఉంటుందని అంచనా. ఎందుకంటే ఇరువురి మధ్య ఓటింగ్ ను గమనిస్తే కేవలం 1% మాత్రమే ఉంది . థెరిస్సా మే 1% ఆధిక్యంలో ఉండడం వల్ల ఆమె అధికార పగ్గాలు చేపట్టనున్నారని తెలిసింది. బ్రిటన్ లో దిగువ సభలో మొత్తం 650 స్థానాలు ఉండడంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 326 స్థానాలను గెలవాల్సి ఉంటుంది. భారత సంతతి వారు కూడా ఈ ఎన్నికలల్లో 56 మంది వరకు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు భారత కాలమానం ప్రకారం శుక్రవారం రోజున సాయంత్రం 4.30 నిమిషాలకు వెలువడనున్నాయి.