అడవుల నరికివేతకు పాల్పడితే కఠిన చర్యలు..

SMTV Desk 2017-10-31 12:21:07  KCR Assembly meeting, haritha haram, forest department,

హైదరాబాద్, అక్టోబర్ 31 : స్వచ్ఛతలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరిత హారం కార్యక్రమంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. అడవుల ఆక్రమణలు ఆపకపోతే క్షమించేది లేదని, అలాగే అడవుల నరికివేతలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలుచోట్ల కొన్ని విద్యాసంస్థలు నెలకొల్పాలని, మొక్కలు నాటాలని ఎంతో ఆశగా ఉన్నా స్థలాలు ఎక్కడా ఖాళీ లేవన్నారు. ఇంతటి దుస్థితికి గత ప్రభుత్వాల పనితీరే నిదర్శనమన్నారు. ఇందులో భాగంగానే అటవి శాఖలో ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెట్టామని, ఈ శాఖలో ఇప్పటివరకు యాభై శాతం ఖాళీలు ఉన్నాయని వాటిని త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ స్వచ్చ భారత్ కార్యక్రమంలో అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరారు.