వన్డేల్లో అగ్రస్థానంలోకి విరాట్..

SMTV Desk 2017-10-30 18:52:46  ICC ODI RANKINGS, KOHLI, AB de Villiers, HEAD QUARTERS DUBAI

దుబాయ్, అక్టోబర్ 30 : టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి వన్డేల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఐసిసి తాజాగా సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్ జాబితాలో కోహ్లీ (889) ప్రధమ స్థానం పొందంగా, దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబి డివిలియర్స్ (872) ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్ మ్యాచ్ తో తొలి స్థానంను డివిలియర్స్ సొంతం చేసుకోగా, ఇప్పుడు కోహ్లీ మరల టాప్ ర్యాంక్ ను తన వశం చేసుకున్నాడు. భారత్ ఆటగాళ్ళలో రోహిత్ శర్మ తన పాయింట్స్ ని మెరుగుపరుచు కొని ఏడవ స్థానంలో, ధోని 11 వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా తన కెరియర్ లో అత్యుత్తమ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో కోహ్లీ రెండు శతకాలు సాధించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.