మోహన్ లాల్ రికార్డ్ బ్రేక్...

SMTV Desk 2017-10-29 19:44:10  villain movie, mohan lal, b unnikrishnan, vishal, hansika, rashikhanna

హైదరాబాద్, అక్టోబర్ 29: మలయాళ చిత్ర పరిశ్రమలో విడుదలైన తొలి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద 4.91 కోట్ల వసూళ్లు రాబట్టిన తొలి చిత్రమిది అంటున్నారు. ఇంతకీ భారీ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఏంటి ..? అనుకుంటున్నారా.. బి. ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహించిన ‘విలన్’ చిత్రం, ఇటీవల 27వ తేదిన విడుదలై మలయాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. విశాల్, హన్సిక, రాశీ ఖన్నా ముగ్గురు ఈ చిత్రంతో మలయాళం పరిశ్రమకు పరిచయమయ్యారు. కేరళలో 253 స్క్రీన్లపై ‘విలన్‌’ చిత్రం విడుదలైంది. ఇన్ని స్క్రీన్లపై విడుదలైన తొలి మలయాళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. మోహన్‌లాల్‌ నటించిన చిత్రం ‘పులిమురుగన్‌’ కూడా గతంలో మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డ్ ను ‘విలన్’ బ్రేక్ చేసేలా ఉందని సినీ వర్గాలలో టాక్.