దేశంలోకి ఎఫ్ డి ఐ ల వరద..

SMTV Desk 2017-06-09 10:44:16  fdi, fdi in india, pm, increase fdis

న్యూఢిల్లీ, జూన్ 08 ‌: ఎన్ డి ఎ ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళికా కృషి మూలంగా ఎఫ్ డి ఐల వరద పారింది. గత ప్రభుత్వం కంటే రెట్టింపు ఎఫ్ డి ఐలు ఎన్ డి ఎ పాలనలో వచ్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2013 లో 34 వేల 487 బిలియన్ డాలర్లు ఉంటే 2016లో 61 వేల 724 బిలియన్ డాలర్లకు ఎఫ్ డి ఐలు పెరిగాయి. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్రమోది సోషల్ మీడియాలో వ్రాసిన వ్యాసం లో ప్రపంచ ఆర్థిక రంగంలో ఉజ్వల తారగా భారత్ వెలుగొందుతోందని చెప్పారు. భారత్ లో వ్యాపారం చేయడాన్ని చాల సులభతరం చేశామనీ, పన్నుల వ్యవస్థ కూడా స్థిరంగా ఉందని తెలిపారు. వస్తు-సేవల పన్ను ద్వారా దేశానికి ఎంతో ప్రయోజనం లభించనుందని చెప్పారు. 2014 లో మేం అధికారం చేపట్టినప్పుడు దేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం పైనా, వ్యవస్థలపైనా విశ్వాసమే కనిపించేది కాదని, పెట్టుబడులకు ప్రోత్సాహకాలు లేవు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఉన్నత వర్గాల తీరు కలిసి పరిశ్రమను నైతికంగా నీరుగార్చాయని, ఆ వాతావరణాన్ని మార్చడం మా ప్రాధాన్యాల్లో ఒకటిగా భావించాం, గత మూడేళ్ళలో దానిని సాధించాం అని మోదీ వివరించారు. తమ ప్రభుత్వం సాధించిన సానుకూల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. సంస్కరణల అజెండాను సమగ్రంగా సమ్మిళితంగా రూపొందించి అన్ని వర్గాలకూ, అన్ని ప్రాంతాలకూ, అవసరమైన సమస్త అంశాలకూ భాగం కల్పించామని వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దేశ పురోగతి ఆధారపడిఉంటుంది. ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా విదేశీ మారకద్రవ్యం పెరుగుతుంది. తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉంటుంది