ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల నిబంధనలు కఠినతరం

SMTV Desk 2017-05-28 15:47:06  registration,anywher,subregistar

హైదరాబాద్, మే 26 : ఎనీవేర్ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు వెలుగుచూస్తున్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. అక్రమాలు, అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఎనీవేర్ విధానంలో లొసుగులను నివారించడానికి, మెుత్తంగా రిజిస్ట్రేషన్లలో అక్రమాలను నిరోధించడానికి కఠిన ఆంక్షలతో ఉత్తర్వులను జారీ చేసేందుకు రంగం సిద్దమైంది. అక్రమాలను నియంత్రించడంలో జిల్లా రిజిష్ట్రార్ల అధికారాలను తగ్గించాలని నిర్ణయించారు. సబ్ రిజిస్ట్రార్ నిరంతర నిఘా అవసరమని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి జిల్లాలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు అన్న విధానంలో అక్రమాలను నిరోధించడానికి ప్రభుత్వం ఆరు నెలల కిందటే స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. కొన్ని స్వల్ప మార్పులవసరమని భావించి అమలు చేయకుండా ఉన్నత స్థాయిలో పెండింగ్ లో ఉంచారు. కానీ ఎనీవేర్ లో అక్రమాలు మితిమీరుతుండడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డిఐజిలు చొరవ తీసుకోని ప్రభుత్వ మార్గదర్శకాలను అనధికారికంగా అమలు చేస్తున్నారు.