టిడిపికి రేవంత్ రెడ్డి రాం..రాం ...

SMTV Desk 2017-10-28 14:15:22  revanth reddy, revanth reddy tdp, revanth reddy resign tdp

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. గత కొన్ని రోజుల నుండి రేవంత్ రెడ్డి టిడిపి నుండి తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, రేవంత్ ఆ వార్తలకు స్పందిస్తూ నేనే ఏ టిడిపికి రాజీనామా చేయడం లేదు. ఏ పార్టీకి మారడం లేదు, నాపై వస్తున్న వార్తలు అన్ని కల్పతాలు అని సమాధానం ఇచ్చారు. ఈ రోజు ఏకంగా టిడిపికి రాజీనామా చేసి చూపించారు. కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశం ఉందని పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పుడు రేవంత్ ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో చూడాలి.