నామా నాగేశ్వరరావు పై కేసు నమోదు...

SMTV Desk 2017-10-28 13:56:00  TDP, NAMA NAGESWARA RAO, KHAMMAM , HYDERABAD

ఖమ్మం, అక్టోబర్ 28: తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే... నామా నాగేశ్వరరావు, సుంకర సుజాత అనే మహిళను తన నగ్న చిత్రాలను బయట పెడతానంటూ వేధిస్తున్నాడని, ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు నామా, తన సోదరుడు సీతయ్య ఇద్దరు కలిసి ఆమెను చంపేస్తా అంటూ బెదిరించారని ఫిర్యాదు చేసింది. ఈ కేసు గత మూడు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు తాత్సారం చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. వెంటనే స్పందించిన కోర్టు ఆదేశాల మేరకు నామా నాగేశ్వరరావు తో పాటు తన తమ్ముడు సీతయ్యపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నామా, సుంకర సుజాత వీరి ఇరువురి మధ్య జరిగిన సంభాషణ ఆడియో సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది.