స్పీకర్ కుర్చీ పై మాధవన్...

SMTV Desk 2017-10-28 13:17:31  R. Madhavan, CANADA, Canada Parliament,

కెనడా, అక్టోబర్ 28: ‘ ఓ మంచి అనుభూతిని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ తమిళ నటుడు మాధవన్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఏ౦టా అనుభూతి అనుకుంటున్నారా... ప్రస్తుతం నటుడు మాధవన్ కెనడా పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా ఆయన కెనడా పార్లమెంట్ ను సందర్శించారు. అక్కడ దిగిన ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ... ‘ కెనడా పార్లమెంట్ లో స్పీకర్ కుర్చీ పై ... ఓ మంచి అనుభూతిని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మాధవన్‌ తెలుగులో ‘సవ్యసాచి’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.