భక్తులతో పోటెత్తిన వెంకన్న ఆలయం

SMTV Desk 2017-10-28 13:13:58  Vadapalli Sri Venkateswara Temple, Devotees, Temple EO Mudunoori Satyanarayana raju.

తూర్పుగోదావరి, అక్టోబర్ 28 : జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడు జన్మల పుణ్య ఫలం అని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, అభివృద్ధి కమిటీ చైర్మన్ కరూటూరి నరసింహారావు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తూ.గో. రిపోర్టర్ ఆనంద్