దక్షిణాఫ్రికా జట్టులో ఇద్దరు ఆమ్లాలు..!

SMTV Desk 2017-10-27 19:21:25   South Africa team, T 20 match, Jersey issue,

బ్లోమ్ ఫోంటీన్, అక్టోబర్ 27 : బంగ్లాదేశ్‌-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా సఫారీ జట్టులో ఇన్నింగ్స్ ను హాషిం ఆమ్లా, డీకాక్ ఆరంభిస్తారు. అయితే వారిద్దరి జెర్సీపై ఆమ్లా అని పేరు ఉండడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అసలు విషయంలోకి వస్తే... డీకాక్ తన జెర్సీని పోగొట్టుకున్నాడట. దీంతో సహచర ఆటగాడు ఆమ్లా జెర్సీని ధరించి బరిలోకి దిగాడు. అయితే ఈ విషయం చాలాసేపటి వరకు ఎవరు గమనించలేదు. కానీ జట్టు స్కోర్ 18 పరుగుల వద్ద ఆమ్లా ఔటైన తరువాత డివిలియర్స్ తో కలిసి డీకాక్ ఆడుతున్న సమయంలో ప్రేక్షకుల్లో గందరగోళం మొదలైంది. అసలు విషయం తెలిశాక కాసేపు మైదానంలో నవ్వులు విరిశాయి. మొదటి టీ 20లో దక్షిణాఫ్రికా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.