చంద్రన్న నూతన సంవత్సర కానుక..

SMTV Desk 2017-10-27 19:04:21  chandranna pelli kanuka, ap government schemes, launches.

అమరావతి, అక్టోబర్ 27 : ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల తరహాలోనే బీసీ పేద మహిళలకు చంద్రన్న పెళ్లి కానుక వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాలను సిద్దం చేస్తోంది. ఈ పథకం కోసం రూ.300 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని నూతన సంవత్సర కానుకగా అమలులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఏటా లక్ష మందికి లబ్ది చేకూరనుంది. డిసెంబర్ లో ఇందుకు సంబంధించి జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పథకానికి ఆన్‌లైన్ లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియకు మండల అధికారులు పెళ్లిరోజున వధువుకు రూ.30,000 లను అందిస్తారు. దీనితో పాటు ముఖ్యమంత్రి ఫొటో ముద్రించిన గ్రీటింగ్‌ కార్డును అందజేస్తారు. ఇందులో నూతన వధూవరులకు ముఖ్యమంత్రి తరఫున శుభాకాంక్షలతోపాటు సందేశమూ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.