‘బ్లూవేల్‌’గేమ్‌ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.....

SMTV Desk 2017-10-27 18:56:13  BlueWale Game, supreme court, central government, delhi

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 27 : ఇటీవల ఆన్‌లైన్‌ గేమ్‌ తో చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న ‘బ్లూవేల్‌’ గేమ్‌ను జాతీయ సమస్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. చిన్నారులు ఈ గేమ్‌ ఆడకుండా అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని దూరదర్శన్‌కు సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రమాదకర గేమ్‌ అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించింది. రోజులో ప్రధాన సమయాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు డీడీ సహా ఇతర ఛానళ్లు కేటాయించాలని పేర్కొంది. ఇప్పటికే ‘బ్లూవేల్‌’ సమస్య గురించి నిపుణుల బృందం పరిశీలన జరుపుతోందని కేంద్రం సుప్రీం కోర్టుకు వివరించింది. ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.