జ‌గ్గ‌య్య‌పేట మున్సిప‌ల్ ఎన్నిక వాయిదా

SMTV Desk 2017-10-27 18:13:01  Jagayya Peta Elections postponed, Jagayya peta Municipal elections

కృష్ణా, అక్టోబర్ 27: జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు. ఈ మేర‌కు ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి హరీష్‌ తెలిపారు. ఈ ఎన్నిక టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. తమ కౌన్సిలర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అపహరించారంటూ పురపాలక సమావేశ మందిరంలో టీడీపీ ఆందోళన చేపట్టింది. కిడ్నాప్‌ అయిన ఇద్దరు సభ్యులను తీసుకొచ్చేంత వరకు ఎన్నిక జరగనివ్వబోమంటూ తెదేపా నేతలు, సభ్యులు నినాదాలు చేశారు