ఏప్రిల్‌ 4 నుంచి ఐపీఎల్‌ ధనాధన్..

SMTV Desk 2017-10-26 18:20:09  ipl match 2018, star sports, Chennai super kings.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26 : ఐపీఎల్‌... పరిమిత ఓవర్లలో అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచిపెడుతుంది. 2008 లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటి వరకు 10 సీజన్లు పూర్తి చేసుకొంది. అయితే పదేళ్ల కాంట్రాక్టు ఈ ఏడాది ముగియడంతో ఏ ఆటగాడు ఏ జట్టుకు ఆడతాడో ఇంకా తెలియ రాలేదు. మరోపక్క గుజరాత్‌ లయన్స్‌, రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్స్‌ టోర్నీ నుంచి తప్పుకోగా, రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తిరిగి ఐపీఎల్‌ ఆడబోతున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్ జట్టు పూర్తి మార్పుతో రాయల్స్ జట్టుగా బరిలోకి దిగుతుందని సమాచారం. ఏప్రిల్‌ 4న ఐపీఎల్‌-2018 టోర్నీని అంగరంగ వైభవంగా ప్రారంభించి.. మే 31న ఫైనల్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ సిద్దం చేస్తున్నారు.