మూడు మృతదేహాలు కలకలం..

SMTV Desk 2017-10-25 18:57:57  CRIME, KRISHNA DISTRICT, RAILWAY STATION, TELAPROLU

అమరావతి, అక్టోబర్ 25: కృష్ణ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కృష్ణ జిల్లా ఉంగుటూరు మండలం తెలప్రోలు వద్ద రైల్వే ట్రాక్ పై మూడు మృతదేహాలు కనిపించడం సంచలనం రేకెత్తించింది. మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా, ఆరేళ్ల చిన్నారి ఉంది. విజయవాడ-విశాఖపట్టణం రైలు మార్గంలో 328 లెవెల్ క్రాసింగ్ సమీపంలో మృతదేహాలు పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రైలు నుంచి ప్రమాదవశాత్తు జారీ పడ్డారా ? లేదా ఆత్మహత్య ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.