మాకు ఏంజిల్ లాంటి అమ్మాయి పుట్టింది...

SMTV Desk 2017-10-25 13:38:25  asin, akshay kumar, asin daughter, rahul sharma

హైదరాబాద్, అక్టోబర్ 25: అందాల తార అసిన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో... ‘మాకు ఏంజిల్ లాంటి అమ్మాయి పుట్టింది. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. తొమ్మిది నెలలు నాకు, నా భర్తకు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. మమ్మల్ని అభిమానిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ పాప ఫోటో ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అసిన్‌, రాహుల్‌ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అసిన్, అక్షయ్ కుమార్ కలిసి ‘కిలాడీ 789’ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు.