కోహ్లి దూకుడే భారత్ బలం : మాస్టర్ బ్లాస్టర్

SMTV Desk 2017-10-24 15:32:26  sachin tendulkhar comments on virat kohli, india, newziland.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24 : భారత్ క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్, టీం ఇండియా కెప్టెన్ కోహ్లిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. రెండు రోజుల క్రితం కివీస్ తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించిన విరాట్, ఆసీస్ ఆటగాడు రికీ పాంటింగ్ వన్డే రికార్డును అధిగమించిన నేపధ్యంలో సచిన్ అభినందించారు. “కోహ్లి అరంగేట్రం మ్యాచ్ నుండి దూకుడు మారలేదు. అదే బ్యాటింగ్.. అయితే దూకుడుపై చాలా మంది విమర్శలు గుప్పించారు. కానీ కోహ్లి దూకుడు మాత్రం భారత్ కు బలంగా మారింది. జట్టుకు కోహ్లి దూకుడే బలమని నేను నమ్ముతున్నాను. ఆటగాడిగా ఆడే విధానంలో అతని దృక్పథం మారింది” అని సచిన్ విశ్లేషించారు.