పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి దేవినేని

SMTV Desk 2017-10-24 10:32:52  polavaram project visit, minister Devineni Uma.

విజయవాడ, అక్టోబర్ 24 : పోలవరం ప్రాజెక్టును మంత్రి దేవినేని ఉమ సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులపై కేంద్ర జల వనరుల శాఖ నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. తొలిసారి పర్యటనకు వచ్చినప్పుడు చేసిన సూచనల ప్రకారం.. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నిపుణుల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రెండు రోజుల తర్వాత ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశ౦ కానున్నట్లు మంత్రి దేవినేని తెలిపారు.