ఇంటింటికి తెలుగుదేశం

SMTV Desk 2017-10-24 10:24:33  TDP starts door-to-door campaigning in east godavari, Sri Golapalli Suryaravu.

తూర్పుగోదావరి, అక్టోబర్ 24 : ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం, శంకరగుప్తం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమ౦లో స్థానిక శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి సూర్యారావు జెండా వందనం చేసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో వారితో పాటు స్థానిక సర్పంచ్ శ్రీ ఉల్లూరి బాలచంద్ర గోపాలరావు, డెల్టా చైర్మన్ శ్రీ భూపతి రాజు ఈశ్వర రాజు వర్మ, శ్రీ బోనం నాగేశ్వరరావు, శ్రీమతి గేదెల వరలక్షి, శ్రీమతి మంగెన భూదేవి, శ్రీమతి మోకా పార్వతి, శ్రీమతి కాకి లక్ష్మీదేవి, శ్రీమతి గుండుబొగుల గంగాభవాని, శ్రీమతి రాపాక అరుణ, శ్రీమతి పప్పుల సరస్వతి, శ్రీ రుద్రరాజు సత్యనారాయణ రాజు, శ్రీ అడబాల సాయిబాబా, శ్రీ అడబాల యుగంధర్, శ్రీ కోళ్ల వెంకన్న, శ్రీ ముపర్తి నాని, శ్రీ గుబ్బల నాగేశ్వరరావు, సంస్కృతిక జిల్లా అధ్యక్షుడు శ్రీ మట్టా రాజబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.