న్యాయస్థానంలో జగన్ కు నిరాశే మిగిలింది...

SMTV Desk 2017-10-23 20:01:46  y s jaganmohanreddy, court, judgment,

హైదరాబాద్, అక్టోబర్ 23: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన వై కాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి నిరాశే మిగిలింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దాఖలు చేసిన 11 అభియోగ పత్రాలు, ఇడీ సమర్పించిన 4 అభియోగ పత్రాలలో మొదటి నిందితుడిగా ఉన్న జగన్, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వుంది. కానీ తాను పాదయాత్ర నిర్వహించ౦డం ఉన్నందున నవంబర్ 2 నుంచి ఆరు నెలల పాటు విచారణకు హాజరు కాకుండా అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని జగన్ కోరారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, పాద యాత్ర చేయనున్నానని, ప్రస్తుతం కేసు విచారణ ముమ్మరంగా జరగడం లేదు కాబట్టి గైర్హాజరుకు అనుమతి ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఈ నెల 20న ఇరువైపులా వాదనలు ముగిశాయి. దీనిపై ఈరోజు న్యాయస్థానం జగన్ అభ్యర్ధనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీవ్రమైన నేరాలలో నెలల తరబడి వ్యక్తిగత హాజరును మినహాయింపు ఇవ్వరాదని రాజకీయాల కోసం గైర్హాజరుకి చట్టం సమ్మతించదని జగన్ అభ్యర్థనను తిరస్కరించింది.