రెట్టింపౌతున్న శాంసంగ్ ఉత్పత్తులు

SMTV Desk 2017-06-09 10:05:17  samsung, cellphone, refrizirator, tv, noida

న్యూఢిల్లీ, జూన్ 08 ‌: సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన ఉత్పత్తి యూనిట్ ల సామర్ధ్యాన్ని రెట్టింపు చేయనుంది. అందుకు అనుగుణంగా విస్తరణ ప్రణాళికను తయారు చేసింది. ఆ మేరకు నోయిడాలో భూమి పూజ ను నిర్వహించారు. రెండేళ్ళలో విస్తరణ పనులు పూర్తి కానున్నాయి. భారత్ లో తయారీ, భారత్ కోసం తయారీకి శాంసంగ్ కట్టుబడి ఉందని అందులో భాగంగానే విస్తరణ ప్రణాళికలని సంస్థ పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజీరేటర్లు, టీవి ప్యానెళ్ల ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు ఉత్పత్తి యూనిట్లను విస్తరించనున్నారు. అందుకు ప్రస్తుతం ఉన్న నోయిడా ప్లాంట్ పక్కన ఉన్న 35 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గాను 4 వేల 915 కోట్లు పెట్టుబడి సోమ్మును ఖర్చు చేయనున్నారు. ప్రతిపాదిత స్థలంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో కేంద్రం మంత్రి రవిశంకర్ ప్రసాద్, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తదితరులు హజరయ్యారు. ప్రస్తుతం వార్షికంగా 50 లక్షల స్మార్ట్ ఫోన్ల తయారీ సామర్థ్యం కాస్తా 1.2 కోట్లకు, రిఫ్రిజిరేటర్ల సామర్థ్యం 15 నుంచి 30 లక్షలకు, టీవీ ప్యానెళ్ల ఉత్పత్తి 13 లక్షల నుంచి 26 లక్షలకు ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది.