హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రభాస్ కథానాయకుడిగా, సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నేడు యాంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర బృందం ‘సాహో’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ బ్లాక్ కోట్ ధరించి ఒక చెయ్యి పాకెట్‌లో మరో చేతిలో ఫోన్ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.