బాహుబలికి బర్త్ డే విషేస్స్...

SMTV Desk 2017-10-23 17:41:55  prabas, prabas birthday, sahoo firstlook

హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ సినిమాలతో గుర్తింపు పొందిన బాహుబలి ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయి, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని, ఆ తరువాత ‘ఛత్రపతి’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’, వంటి చిత్రాలలో నటించి అగ్ర కథానాయకుడిగా నిలిచారు. ఒక తెలుగులోనే కాదు, తమిళ౦, హిందీ, మలయాళ౦, కన్నడ, అన్నీ భాషలలో విడుదలైన బాహుబలి సినిమాతో టాలీవుడ్ లో అగ్ర హీరోగా పేరొందారు. 38 వ జన్మదినం జరుపుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పలువురు సినీతారాలు, దర్శకులు, నిర్మాతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘పుట్టినరోజు జేజేలు రాజుగారికి. హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ ఫ్రెండ్‌’ అంటూ రానా దగ్గుబాటి, ‘అతను నెంబర్‌ వన్‌. నే నిప్పటి వరకు కలిసిన మంచి వ్యక్తుల్లో ఒకరు. అతనికి ఇంతటి ప్రేమాభిమానాలు ఉంటాయనడంలో సందేహం లేదు. హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌’ అంటూ శ్రద్దా కపూర్, ‘తెలుగు చిత్ర పరిశ్రమ డార్లింగ్‌కు హ్యాపీ బర్త్‌డే. ‘సాహో’ లుక్‌ అదిరింది.’ అంటూ సాయి ధరమ్ తేజ, ‘హ్యాపీ బ‌ర్త్ డే ప్రభాస్ డార్లింగ్’ అని అల్లు అర్జున్ ట్వీట్లు చేశారు. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, కొరటాల శివ, సునీల్, శోభు యార్లగడ్డ, ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.