అటవీ ప్రాంతంలో కాల్పుల కలకలం

SMTV Desk 2017-10-23 16:00:37  forest firing, east godavari, devipatnam district.

తూర్పుగోదావరి, అక్టోబర్ 23 : దండంగి అటవీ ప్రాంతంలో కాల్పుల కలకలం చెలరేగింది. దేవీపట్నం మండలంలోని అటవి సిబ్బందిపై వేటగాళ్ళు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, ఈ కాల్పుల వెనుక అసలు కథ ఏంటి అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వేటగాళ్ళు వేటలో భాగంగా కాల్చిన కాల్పులా..? లేదంటే కావాలని అటవీ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారా..? అనే కోణంలో విచారిస్తున్నారని సమాచారం.