చెరువు గట్ల తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

SMTV Desk 2017-10-23 15:45:56  west godavari, Pond gutters, Excavation in the pump outflow gutters

తూర్పుగోదావరి, అక్టోబర్ 23 : చెరువు గట్లను తవ్వుతున్నారంటూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించిన ఘటన సామర్లకోట మండలంలో చోటు చేసుకుంది. పెద్ద బ్రహ్మదేవం వానపల్లి చెరువు అవుట్ ఫ్లో గట్లలో తవ్వకాలు జరుగుతు౦డగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ గట్ల తవ్వకం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని, ముఖ్యంగా ఈ ఊరితో పాటు రైల్వే ట్రాక్ కు సైతం ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై అధికారులు స్పందించి వెంటనే ఆ పనులను ఆపివేయాల్సిందిగా గ్రామస్తులు కోరారు.